సీఎంఆర్ ధాన్యం మిల్లింగ్ చేయడంలో మిల్లర్లు జాప్యం చేయడం లేదు. బాయిల్డ్ రైస్ ఇస్తామంటే ఎఫ్‌సీఐ అంగీకరించడం లేదు. దీనివల్ల బియ్యం సేకరణ నిలిచిపోవడంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాయిల్డ్ రైస్‌ను వెంటనే స్వీకరించాలి.
– కర్నాటి రమేష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సీఎంఆర్ అప్పగించే విషయలో మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ వెంటనే చెల్లించాలి. ఎఫ్‌సీఐ వద్ద స్థల సమస్య ఉండడంతో మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. బియ్యం కేటాయింపుల విషయంలో మిల్లర్లపై ఒత్తిడి చేయడంతోపాటు ఎఫ్‌సీఐ మిల్లర్లకు స్థలం కేటాయించేలా చూస్తున్నాం. సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి.
– రాంపతి, పౌరసరఫరాల శాఖ
జిల్లా మేనేజర్


