చేపల పిల్లల పంపిణీ లేనట్లేనా! | - | Sakshi
Sakshi News home page

చేపల పిల్లల పంపిణీ లేనట్లేనా!

Oct 26 2026 8:18 AM | Updated on Oct 26 2026 8:18 AM

చెరువులను మరోసారి పరిశీలిస్తాం

నీరు త్వరగా ఆవిరయ్యే అవకాశం..

నల్లగొండ టూటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మత్స్యకారులకు అందించే చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో చెరువులు, జలాశయాలు, కుంటల్లో నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1169 చెరువులు, జలాశయాల్లో కేవలం 169 చెరువుల్లోనే సగం వరకు నీరు ఉన్నట్లు సాగునీటి శాఖ అధికారులు మత్స్యశాఖకు నివేదిక అందించారు. ఈ నివేదికను మత్స్యశాఖ అధికారులు ఉన్నతాధికారులకు పంపించడంతో మరోసారి చెరువులు, జలాశయాలల్లో ఉన్న నీటి వసతి, ఎన్ని నెలలు నీరు ఉంటుందో సమగ్ర నివేధిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దాంతో ఈసారి చేప పిల్లల పంపిణీ చేయాలా వద్ద అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

అన్నీ పరిశీలించాకే నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం సైతం చేప పిల్లల పంపిణీపై సమగ్ర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే చెరువులు, కుంటల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేప పిల్లలు 350 గ్రాముల నుంచి 500 గ్రాముల బరువు పెరగాలంటే కనీసంగా ఆరు నెలల పాటు చెరువుల్లో నీరుండాలి. కానీ రాబోయే రెండు మూడు నెలలు మాత్రమే చెరువుల్లో నీరు ఉంటే చేప పిల్లలు పంపిణీ చేసినా ప్రజాధనం వృథా తప్ప మత్స్యకారులకు ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం లేదనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

5.90 కోట్ల నుంచి 2 కోట్లకు తగ్గింపు..

జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1169 వరకు జలాశయాలు, చెరువులు ఉన్నాయి. మత్స్యశాఖ జిల్లా అధికారులు జిల్లాకు 5.90 కోట్ల చేప పిల్లల అవసరం ఉందని గతంలోనే ప్రతిపాదనలు పంపించారు. అవసరమైన చేప పిల్లల పంపిణీ కొరకు టెండర్లు సైతం నిర్వహించి ఖరారు చేశారు. ఇటీవల సాగునీటి శాఖ అధికారులు అందించిన నివేధిక ప్రకారం జిల్లాలో కేవలం 169 చెరువుల్లో మాత్రమే సగం వరకు, కొన్నింట్లో సగానికి పైగా నీరు ఉన్నట్లు చూపించారు. ఈ లెక్కన అయితే కేవలం 2కోట్ల చేప పిల్లలు సరిపోతాయని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఇవి కూడా పంపిణీ చేస్తారా లేక నిలిపి వేస్తారా అనే చర్చ జరుగుతోంది.

జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో నీటి నిల్వలు గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. నీటి నిల్వలు ఉన్న చెరువులను గుర్తించేందుకు ఇరిగేషన్‌ శాఖ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం. నీటి నిల్వ ఎక్కువ నెలలు ఉన్న చెరువుల్లోనే చేప పిల్లల పంపిణీ చేస్తాం.

– సుకీర్తన, మత్స్యశాఖ జిల్లా అధికారి

ఫ ఎల్‌నినో ప్రభావంతో ప్రభుత్వం

వెనుకడుగు

ఫ 169 చెరువుల్లోనే సగానికి పైగా నీరు

ఫ ఆరు నెలలు నీరుంటేనే చేప పిల్లలు ఎదిగే అవకాశం

ఫ మరోసారి నీటి లెక్కలు

తీయాలని ఆదేశాలు

ఎన్ని చెరువుల్లో ఎంత శాతం నీరు నిల్వ ఉందనే వివరాల సేకరించాలని తాజాగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా చెరువుల్లో కూడా జనవరి, ఫిబ్రవరి వరకు నీరు ఉంటుందా లేక ముందుగానే చెరువుల్లో నీరు ఇంకిపోయే పరిస్థితులు ఉన్నాయా అని ఇరిగేషన్‌ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ ఏడాది ఒక్కసారి కూడా భారీ వర్షం కురకపోవడంతో చెరువుల్లో ఉన్న నీరు సైతం త్వరగా ఆవిరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి నీరు ఉన్న చెరువుల వివరాలు అందిన తరువాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement