పట్టభద్రుల ఓటరు నమోదు
చండూరు : తెలంగాణలో కాంగ్రెస్ సృష్టించిన కరువు విలయతాండవం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం చండూరులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ సృష్టించిందే ఎక్కువగా ఉందని.. వర్షాలు లేవు, కరెంటు కూడా వస్తలేదన్నారు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చాడని.. ఇప్పుడెందుకు కాంగ్రెస్ ఇవ్వలేక పోతోందని ప్రశ్నించారు. కరెంటు కొనాలన్నా దొరుకతలేదు అనేది అబద్ధమన్నారు. మునుగోడులో 60 ఏళ్ల కాంగ్రెస్ పెంచి పోషించిన ఫ్లోరైడ్‌ను కేసీఆర్ ఆరేళ్లలో పారదోలాడని.. కాంగ్రెస్ తిరిగి మూడేళ్లలోనే మునుగోడు, దేవరకొండను ఫ్లోరైడ్ ప్రాంతంగా మారుస్తోందని మండిపడ్డారు. ఇక్కడి ఎమ్మెల్యేకు మంత్రి పదవి పంచాయితీ తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై పట్టింపు లేదని విమర్శించారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు హెలికాపర్ వేసుకుని వస్తున్నరు తప్ప రూపాయి పని చేయడం లేదని మండిపడ్డారు. త్వరలో శివన్నగూడం రిజర్వాయర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, పాల్వాయి స్రవంతి, బోయపల్లి అనంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలో ఆదివారం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించేలా రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మందడి సైదిరెడ్డి, కార్పొరేటర్ మారగోని భవాని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, కన్నారావు, పెండం ధనంజయ, గంజి రాజేందర్, బొమ్మరబోయిన నాగార్జున, రాపోలు వెంకటేశ్వర్లు, గాదె వివేక్‌రెడ్డి పాల్గొన్నారు.


