తిప్పర్తి : ఆయిల్ పామ్ సాగులో అధికారులు, ఉద్యాన శాఖ సూచనల ప్రకారం రైతులు ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులు సమర్థవంతంగా నిర్వహించినప్పుడే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. ఆయిల్ పామ్ రైతు సొసైటీ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో తిప్పర్తి మండలంలోని దుప్పలపల్లిలో ఆదివారం నిర్వహించిన ఆయిల్ పామ్ రైతు సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఉద్యాన శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం పెంపొందించుకోవడం ద్వారా ఆయిల్ పామ్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, నాణ్యమైన మొక్కల ఎంపిక, శాసీ్త్రయ సాగు విధానం, యాజమాన్య పద్ధతులు, చీడపీడలు–తెగుళ్ల నివారణ, నీటి యాజమాన్యం, అంతర పంటల సాగు మరియు అధిక దిగుబడి సాధించే అంశాలపై రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆయిల్ పామ్ రైతు సొసైటీ అధ్యక్షుడు గురువారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, ఆయిల్ పామ్ ప్రతినిధులు డీజీఎం యాదగిరి, పీఎం మధుసూదన్‌రెడ్డి, రైతు నాయకులు లింగారెడ్డితోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు.


