భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం

Oct 24 2026 11:07 AM | Updated on Oct 24 2026 11:07 AM

భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం

ఫ పొగిళ్ల, కంబాలపల్లిలో కలెక్టర్‌ పర్యటన

దేవరకొండ (చందంపేట) : రైతుల భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం చందంపేట మండలంలోని కంబాలపల్లి, పొగిళ్ల గ్రామాల్లో భూ సర్వే నిర్వహించిన ప్రాంతాలను ఆయన సందర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడి భూ సర్వే వివరాలు, భూముల విస్తీర్ణం, రికార్డులు, అభ్యంతరాల గురించి అడిగి తెలుసుకున్నారు. పొగిళ్ల గ్రామంలోని సర్వే నంబర్‌ 2లోని 1,066 ఎకరాల భూమిని సర్వే చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. భూముల రికార్డులు, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణానాన్ని సరిపోల్చి పరిశీలించాలని సూచించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే రైతులు తమకు సంబంధించి ధ్రువ పత్రాలను చూపించాలన్నారు. అనంతరం కంబాలపల్లి రైతు వేదికలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామంలోని సర్వే నంబర్‌ 37, 50లకు సంబంధించి సర్వే వివరాలను గ్రామసభలో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. మహిళా సంఘాలు గ్రామాల్లో అందుబాటులో ఉన్న బంజారు భూములను ఉపయోగించుకొనిసోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement