ఆంగ్ల నైపుణ్యంతో మెరుగైన అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

ఆంగ్ల నైపుణ్యంతో మెరుగైన అవకాశాలు

Oct 24 2026 11:07 AM | Updated on Oct 24 2026 11:07 AM

నల్లగొండ టూటౌన్‌ : ఆంగ్ల నైపుణ్యంతో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు దక్కుతాయని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు రూపొందించిన శ్రీఇంగ్లిష్‌ ఫర్‌ ఎఫెక్టివ్‌ ఎక్స్‌ప్రెషన్‌శ్రీ పాఠ్యపుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆంగ్లాన్ని కేవలం పాఠ్యాంశంగానే కాకుండా, విద్యా–ఉద్యోగ అవకాశాలను అందుకునేందుకు ఉపయోగపడే నైపుణ్యంగా అభ్యసించాలని సూచించారు. పాఠ్యపుస్తక రూపకల్పనలో కృషి చేసిన సంపాదకులు, రచయితలు, సహకరించిన బృందాన్ని ఆయన అభినందించారు.కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అంజిరెడ్డి, కె.అరుణప్రియ, బి.విజయ, రాహత్‌ ఖానం, బి.లీలారాణి, సిహెచ్‌.సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement