పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
- IIలో
21 నుంచి ఫొటోగ్రఫీ, వ్యాసరచన పోటీలు
నల్లగొండ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రస్థాయిలో ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీస్ సేవలు, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు తీసిన 3 ఫొటోలు, తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ ఈ నెల 28వ తేదీలోపు https://forms.gle/gVp PmmWFrWZNN RBF6 లింక్ ద్వారా పంపవచ్చని పేర్కొన్నారు. 6 నుంచి పీజీ చదివే విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణలో పోలీసులు, పౌరుల పాత్ర, సోషల్ మీడియా దుర్వినియోగం అరికట్టడంలో, తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో పోలీసుల పాత్ర అంశాలపై వ్యాసరచన పోటీలు ఉంటాయని ఎస్పీ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 26లోగా తమ వ్యాసాలను సమర్పించాలని కోరారు. https://forms.gle/YkeKUscWu5LF YWFH7 లింక్‌పై క్లిక్ చేసి విద్యార్థుల పేరు, విద్యార్హత వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు వారి వ్యాసాలను పేపర్‌పై రాసి దాన్ని పీడీఎఫ్ పార్మట్‌లో (500 పదాలకు మించకుండా) అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేయాలని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.


