నకిరేకల్ : జలసిరి పనుల ప్రాధాన్యతపై ప్రజలకు వివరించేలా నకిరేకల్ ఎంపీడీఓ గన్నోజు బ్రహ్మచారి రాసిన బతుకమ్మ పాట చిత్రీకరణ షూటింగ్‌ను శుక్రవారం నకిరేకల్ మండలం నెల్లిబండలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ప్రారంభిచారు. పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు బతుకమ్మ పాటతో ఆడిన దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం స్థానిక కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. నీటి సంరక్షణ, జల వనరుల అభివృద్ధి అవశ్యకతను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పాట రాశానని ఎంపీడీఓ బ్రహ్మచారి తెలిపారు. ఈ వేడుకల్లో పంచాయతీ అధికారి రజిత, ఏపీఓ రమణయ్య, నెల్లిబండ, చందంపల్లి, గొల్లగూడెం గ్రామాల సర్పంచులు ఆడెపు రాఘవులు, మాచర్ల చంద్రకళయాదగిరి, చిర్రబోయిన లక్ష్మీసత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.


