రామగిరి(నల్లగొండ) : రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత దుస్థితికి బీఆర్‌ఎస్, కాంగ్రేస్ పార్టీల వైఫల్యాలే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లాలోని మేళ్ల దుప్పలపల్లి, తొరగల్లు, చిన మాదారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సదంర్భంగా ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చి, తీరా 3 నుంచి 4 గంటలే ఇస్తోందని మండిపడ్డారు. అరకొర విద్యుత్ సరఫరా వల్ల పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫసల్ భీమా యోజన అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు పరిహారం అందకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు భోగరి అనిల్‌కుమార్, నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పిల్లి రామరాజుయాదవ్, బండారు ప్రసాద్, మేళ్ల దుప్పలపల్లి సర్పంచ్ కోమటిరెడ్డి సంధ్యారాణి పాల్గొన్నారు.
రైతులతో ముఖాముఖి
కనగల్ : ఎండిన పంటలకు పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చిన్నమాదారం వద్ద ఎండిన పొలాలను ఆయన పరిశీలించి గ్రామపంచాయతీ వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. అంతకుముందు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి కరెంటు సరఫరా వివరాలను తెలుసుకున్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


