వైటీపీఎస్‌లో నిర్వహణ ప్రైవేట్‌కు! | - | Sakshi
Sakshi News home page

వైటీపీఎస్‌లో నిర్వహణ ప్రైవేట్‌కు!

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌)లో నిర్వహణ పనులను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (టీజీజెన్‌కో) పవర్‌మెక్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ప్లాంట్‌ అవసరాలకు నిత్యం 70వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం కాగా.. సరిపడా బొగ్గు రవాణా జరగకపోవడంతో ఆర్థిక భారం పెరిగి పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి కావడం లేదు. ఆ భారాన్ని తప్పించేందుకు టీజీ జెన్‌కో ప్రైవేటీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. ప్లాంట్‌లోని ఐదు యూనిట్లలో బూడిద, బొగ్గు హ్యాండ్లింగ్‌ నిర్వహణ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో సమగ్ర ఆపరేషన్‌ మెయింటనెన్స్‌ (ఓఎండీఎం) నిర్వహించేందుకు టెండర్లు ఆహ్వానించగా మూడు సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో పవర్‌మెక్‌ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. ఈ సంస్థ మూడేళ్లపాటు రూ.279.20 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఈ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ సర్వీసెస్‌(బీఎస్‌ఈ) లిమిటెడ్‌కు సమాచారం అందించారు.

పవర్‌ప్లాంట్‌కు బొగ్గు కొరత...

యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌కు బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో ఉత్పత్తి సగానికి పడిపోయింది. రోజుకు సుమారు 14 ర్యాక్‌ల బొగ్గు (70వేల మెట్రిక్‌ టన్నులు) అవసరం ఉండగా 5 నుంచి 7 ర్యాక్‌లు మాత్రమే బొగ్గు రావడంతో విద్యుత్‌ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బొగ్గు కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణలోని విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరాకు సింగరేణి, జెన్‌కో ప్రణాళికను రూపొందించాలని సంబంధిత సీఎండీలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటి నుంచైనా యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ప్రతిరోజు 14ర్యాక్‌ల విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తేనే 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

ఫ పలు విభాగాల్లో పనులు పవర్‌మెక్‌ సంస్థకు అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement