సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

నల్లగొండ టౌన్‌ : చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే తొలగించాలని, ఎస్‌ఆర్‌ ప్రకియను నిలిపివేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఓటు హక్కు పరిరక్షణలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది ఓటర్లను తొలగించే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో నల్లగొండలోని స్థానిక సుభాష్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్‌, సయ్యద్‌హాషం, పుచ్చకాయల నర్సిరెడ్డి, గుండెబోయిన నాగేశ్వర్‌రావు, పబ్బు వీరస్వామి, వెంకటేశ్వర్లు, కెఎస్‌.రెడ్డి, లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement