నల్లగొండ టౌన్ : విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉన్నతంగా చదివి మంచిస్థాయికి చేరుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.రాహుల్ ఆకాంక్షించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాల ప్రాంగణంలో సోమవారం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వాడటం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబం నష్టపోతాయన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ పద్మ, డీపీఓ డాక్టర్ జమీర్, డీఎంఓ డాక్టర్ నగేష్, కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


