మిర్యాలగూడ : పేదల కడుపు నింపడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన చేపట్టిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లకాలంలో ఏ ఒక్క పేదవారిని కూడా రేషన్‌కార్డులు ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే పేదలందరికీ రేషన్‌కార్డులు ఇస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పేదలు దొడ్డు బియ్యం తినలేక నానా అవస్థలు పడ్డారని, కానీ ప్రజా ప్రభుత్వం సన్నబియ్యం అందించి పేదలు కడుపునిండా భోజనం చేసేలా చూస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.48కోట్ల మందికి, మిర్యాలగూడ నియోజకవర్గంలో 2.99లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో సైతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకోవడం తగదన్నారు. సాగర్‌లో నీటి నిల్వ తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బంది రాకుండా చెరువులను నింపుతూ ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకుంటున్నామన్నారు. ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడకుండా నీరందించి ఆదుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం రూ.878 కోట్లతో లిఫ్టు పనులకు శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.175కోట్లు విడుదల చేసి పనులను వేగవంతం చేశామన్నారు. మిర్యాలగూడలో ఇంటిగ్రేటెడ్ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, పెండింగ్‌లో ఉన్న ఫ్‌లై ఓవర్ పనులను సైతం వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రమణారెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం రాంపతి, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీషనవీన్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఫ ఆయకటు రైతులను ఆదుకుంటాం
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


