ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

నల్లగొండ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెటిట వారం రోజుల్లో పరిష్కరించాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల, డివిజన్‌ స్థాయిలో ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యను అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో మొత్తం 148 ఫిర్యాదులు అందాయని.. ఇందులో రెవెన్యూ శాఖకు 66, ఇతర శాఖలకు 82 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ దశరథ్‌, డిప్యూటీ కలెక్టర్‌ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement