కుళాయి.. బిల్లు బకాయి | - | Sakshi
Sakshi News home page

కుళాయి.. బిల్లు బకాయి

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

ఇటీవల పెరిగిన కలెక్షన్లు.. బకాయిలు వసూలు చేస్తాం

నగరంలో భవనాలకు, కుళాయి కలెక్షన్లకు పొంతన సరిపోవడం లేదు. కొన్ని నెలల క్రితం సర్వే నిర్వహించి అక్రమంగా పెట్టుకున్న కనెక్షన్లను గుర్తించి క్రమబద్ధీకరించారు. దాంతో గతంలో 19 వేలు ఉన్న కుళాయి కనెక్షన్లు ఇప్పుడు 33 వేలకుపైగా పెరిగాయి. దాంతో డిమాండ్‌ కూడా పెరిగింది. పాత బకాయిలను మొత్తం వసూలు చేస్తే కార్పొరేషన్‌కు బకాయిలు లేకుండా తాజా ఏరియర్స్‌ బిల్లులు మాత్రమే ఉంటాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి బకాయిలు వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి నగరంలో కుళాయి బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. తాగు నీరు పుష్కలంగా ఇస్తున్నా ప్రజలు బిల్లులు మాత్రం చెల్లించడంలేదు. ఇప్పటివరకు రూ.27.10 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయి. నగరంలోని 48 డివిజన్ల పరిధిలోని కాలనీల్లో మొత్తం 33,247 నల్లా కలెక్షన్లు ఉండగా అందులో వాణిజ్య కనెక్షన్లు 161 ఉన్నాయి. నివాస గృహాలకు అయితే నెలకు రూ.100, వాణిజ్య అవసరాలకు అయితే నెలకు రూ.600 బిల్లులు చెలించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి రెండు దశాబ్దాలుగా కుళాయి బిల్లులపై సరైన పర్యవేక్షణ పెట్టకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌ లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుతం నల్లా బిల్లు సంవత్సర డిమాండ్‌ రూ.4.6 కోట్ల వరకు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.101.43 లక్షల వరకు వసూలైంది.

పాత బకాయిలపై స్పెషల్‌ డ్రైవ్‌ ఏదీ..

మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఖర్చులు పెరుగుతున్న దానికి అనుగుణంగా ఉన్న వనరులను ఉపయోగించుకొని రాబడి పెంచుకోవడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఉదయ సముద్రం నుంచి నగరంలోని ఇళ్లకు తాగు నీటి సరఫరా చేస్తున్నా వారి నుంచి కుళాయి బిల్లులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. పాత బకాయిలు రూ.23.59 కోట్లు పేరుకుపోయినా వాటి వసూలు కోసం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టడం లేదు. తాగునీటి కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం కుళాయి బిల్లులు కూడా వసూలు చేసుకోలేని స్థితిలో ఉండడంపై సర్వత్రా విమర్శలువస్తున్నాయి.

పట్టించుకోని ఇంజనీరింగ్‌ విభాగం...

కుళాయిల కలెక్షన్లు, బిల్లులపై గతంలో సర్వే పలుమార్లు సర్వే నిర్వహించారు. ఎవరు ఎంత బకాయి ఉన్నారు అనే వివరాలతో ఇంటింటికి తిరిగితే బిల్లులు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. పాత బకాయిలను ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, తాగునీటి సరఫరా సిబ్బంది పట్టించుకోని కారణంగానే బకాయిలు పేరుకుపోయిందనేది బహిరంగ రహస్యమే.

నల్లా బిల్లులు నిరంతరం వసూలు చేస్తున్నాం. పాత బకాయిలను కూడా వసూలు చేస్తున్నాం. బకాయిల ను గుర్తించి సిబ్బంది ఇంటింటికి వెళ్లి వసూలు చేస్తున్నారు. నగరవాసులు కుళాయి బిల్లులు తప్పనిసరిగా చెల్లించి కార్పొరేషన్‌ అభివృద్ధికి సహకరించాలి.

– దిలీప్‌భార్గవ్‌, మున్సిపల్‌ ఏఈ

ఫ నీలగిరి నగరంలో నల్లా బిల్లుల బకాయి రూ.27.10 కోట్లు

ఫ బిల్లులు చెల్లించకుండా వినియోగదారుల నిర్లక్ష్యం

ఫ సీరియస్‌గా దృష్టి పెట్టని కార్పొరేషన్‌ యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement