ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికిరైస్ మిల్లర్స్ వినతి
మిర్యాలగూడ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను బాయిల్డ్‌రైస్‌గా తీసుకోవాలని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. సోమవారం మిర్యాలగూడకు వచ్చిన మంత్రిని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి విన్నవించారు. ప్రసుత వానాకాలం సీజన్ 2026–27 సన్నరకం ధాన్యం మిల్లులకు రావడం ప్రారంభమైందని.. గోదాముల్లో సీఎంఆర్ ధాన్యంతో ఉండడం వల్ల సన్నరకం ధాన్యం నిల్వ చేసుకునేందుకు స్థలం కొరత ఏర్పడుతోందన్నారు. తమ వద్ద ఉన్న సీఎంఆర్ ధాన్యం మొత్తం బాయిల్డ్ రైస్ తీసుకునే విధంగా సహకరించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, వెంకటరమణచౌదరి, బండారు కుశలయ్య, గంజి రాము, గోళ్ల రామశేఖర్, హేమనాద్, పొలిశెట్టి ధనుంజయ పాల్గొన్నారు.


