రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక | - | Sakshi
Sakshi News home page

రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

నల్లగొండ టూటౌన్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈనెల 30న నల్లగొండకు రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 9.15 గంటలకు రాంచందర్‌రావు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నల్లగొండ మండలంలోని మేళ్ల దుప్పలపల్లి, తొరగల్లు, చిన్న మాధారం గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడుతారని పేర్కొన్నారు.

ఎంజీయూలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం రెగల్‌ రెక్స్‌నార్డ్‌ సంస్థ సహకారంతో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌–2026 నిర్వహించారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ విభాగాలకు చెందిన 130 మంది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు తొలిదశలో నిర్వహించిన ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో పాల్గొన్నారు. ప్లేస్‌మెంట్‌ నిబంధనల ప్రకారం తదుపరి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్‌, ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ హరీష్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ కొప్పుల అంజిరెడ్డి, ట్రైనింగ్‌ ప్లేస్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ జి.మారేశ్వరరావు, జయంతి, వై.నాగరాజు, వేణుగోపాల్‌రెడ్డి, రేఖ తదితరులు పాల్గొన్నారు.

పోషక విలువలతో ఆరోగ్యం

నల్లగొండ : పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎఫ్‌సీఐ నల్లగొండ డీఎం సువీన్‌ కుమార్‌ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎప్‌సీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్యకర వంటకాల పోటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిల్లెట్స్‌, పప్పుధాన్యాలు, కూరగాయలు తదితర పోషక ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. స్థానికంగా లభించే పోషక పదార్థాలతో ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేయడం ద్వారా పోషకాహారంపై అవగాహన పెంపొందించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు వివిధ రకాల ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏజీఎం రాఘవేంద్రసింగ్‌, దివ్య, గిరిష్మ, షాహిద్‌ ఖాన్‌, రూప, నరేష్‌, అనుష, వినిత, సుప్రియ, విద్యాసాగర్‌, సాజిత్‌, కలైసెల్వి, సతీష్‌రెడ్డి, రంజిత్‌, శ్రీకాంత్‌, అజయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement