నకిరేకల్ : రెడ్డి కులస్తులంతా సమష్టిగా ఉంటూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రెడ్డి సంఘం సీనియర్ నాయకుడు కందాల పాపిరెడ్డి, రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు ఏమిరెడ్డి నర్సిరెడ్డి, జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు జీనుగు జ్యోతిరెడ్డి పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన రెడ్డి సంఘం, రెడ్డి జాగృతి జిల్లా విస్తృత స్థాయి సమావేశం వారు మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి తదితర రంగాల్లో తగిన అవకాశాలు అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కావలంటే రెడ్డి కార్పొరేషన్ లేదా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సూదిని జానకిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు నీరుడు దయాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి ఎడ్ల ఉప్పల్‌రెడ్డి, కందాల నారాయణరెడ్డి, లోకసాని అనితారెడ్డి, సునితారెడ్డి గుత్తా సుమితారెడ్డి, లోకసాని సరితారెడ్డి, పన్నాల రాఘవరెడ్డి, ఎర్ర శంభులింగారెడ్డి, బూత్కురు వెంకట్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కందాల భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


