నల్లగొండ : పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్‌కు జిల్లావ్యాప్తంగా 2,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్షలో ప్రతిభ చూపిన 500 మంది అభ్యర్థులను ఎంపిక చేసి నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. మెయిన్ ఎగ్జామ్‌కు అవసరమైన శిక్షణతోపాటు సబ్జెక్ట్ నిపుణులతో బోధన, మోడల్ టెస్టులు, సందేహాల నివృత్తి, పరీక్ష విధానంపై అవగాహన కల్పించనున్నామని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థుల శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు అవుట్‌డోర్, ఇండోర్ శిక్షణ కూడా అందించనున్నట్లు తెలిపారు. అవసరమైన వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశమని ఎస్పీ తెలిపారు.
ఫ పోలీస్ ఉద్యోగార్థులకు
ఉచిత శిక్షణ కోసం నిర్వహణ
ఫ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన
ఎస్పీ శరత్‌చంద్ర పవార్


