ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

నల్లగొండ : జిల్లాలో ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు రెండు నెలల ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈఓ సుశీందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనె 22న సాయంత్రం 5 గంటలలోపు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి జిల్లా బెస్ట్‌ టీచర్‌ అవార్డు

కనగల్‌ : మండలంలోని చిన్నమాదారం జెడ్పీ హెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న బాలసాహితీ వేత, ఆంగ్ల ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డిని జిల్లా బెస్ట్‌ టీచర్‌ అవార్డుతో ఆదివారం నల్లగొండలోని లయన్స్‌ క్లబ్‌ కార్యాలయంలో లయన్స్‌ క్లబ్స్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు సన్మానించారు. అలాగే 40మంది ఉపాధ్యాయులు, 20మంది ఇంజనీర్లను సన్మానించారు. కార్యక్రమంలో లయన్‌ గవర్నర్‌ కేవీ.ప్రసాద్‌, సతీష్‌ కోడె, లయన్‌ వెంకటేశ్వరరావు, లయన్‌ పిచ్చయ్య, సుధారాణి పాల్గొన్నారు.

‘సంతపురి’ మృతి..

కళా రంగానికి తీరనిలోటు

రామగిరి(నల్లగొండ) : తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించిన ప్రముఖ కవి, రచయిత, సామాజిక కార్యకర్త సంతపురి నారాయణరావు మరణం సాహిత్య, కళారంగాలకు తీరని లోటని పలువురు ప్రముఖులు అన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల నల్లగొండ జిల్లాలోని కవులు, రచయితలు, తెలంగాణ ఉద్యమ నాయకులు క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో ఆయన చిత్రపటం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ప్రముఖ సాహితీవేత్తలు వేణు సంకోజు, మేరెడ్డి యాదగిరిరెడ్డి, గుండె వెంకటేశ్వర్లు, భువనగిరి దేవేందర్‌, బక్క పిచ్చయ్య, పెరుమాళ్ల ఆనంద్‌, డాక్టర్‌ సాగర్ల సత్తయ్య, బండారు శంకర్‌, తోట నరసింహాచారి, పన్నాల గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫీజుల నియంత్రణకు కమిషన్‌ ఏర్పాటు చేయాలి

నల్లగొండ : ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులు, సీట్ల నియంత్రణకు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయాలని డెమొక్రటిక్‌ ఆల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (డేటా) సంఘం నాయకులు అన్నారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మహ్మద్‌ మొహినొద్దీన్‌, టీపీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వెంకటదాసు, హైకో ర్టు న్యాయవాది పద్మారావు, రాములు, నాగలక్ష్మి, పి.రజిత, సీహెచ్‌.సుధాకర్‌ పాల్గొన్నారు

రాష్ట్ర స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు అనుమతి

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండ పట్టణంలోని వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు రాష్ట్ర కమిటీ అనుమతి ఇచ్చిందని ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కమిటీ బాధ్యులు డాక్టర్‌ రఫత్‌ అలీ, జీపీ. పాల్గుణ నుంచి అనుమతి పత్రం పొందినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement