1104 సంఘంతోనే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

1104 సంఘంతోనే సమస్యల పరిష్కారం

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

నల్లగొండ : 1104 సంఘంతోనే కార్మిక సమస్యల పరిష్కారం అవుతాయని టీఈఈ (తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబు అన్నారు. మంగళవారం నల్లగొండలోని యూనియన్‌ ప్రాంతీయ కార్యవర్గ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ ప్రవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాల్లో 1104 యూనియన్‌ పాల్గొన్నదని.. భవిష్యత్‌లో బలమైన ఉద్యమాలను కూడా నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం సాయిబాబు, నిమ్మచెట్ల వెంకటయ్యను విద్యుత్‌ ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీనివాసులు, యూనియన్‌ నాయకులు వి.వెంకటేశ్వర్లు, ఆర్‌.జనార్దన్‌రెడ్డి, గణేష్‌, బాల్య, వేణు, ఎస్‌.వెంకన్న, విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement