వణికిస్తున్న విషజ్వరాలు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న విషజ్వరాలు

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

నల్లగొండ టౌన్‌ : వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లా అంతటా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈగలు, దోమలుతోపాటు పారిశుద్ధ్యం లోపించి జనం అనారోగ్యం పాలవుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పితో ప్రజలు బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో మొదలై వైరల్‌ ఫీవర్‌గా మారుతోంది. తీవ్రమైన జ్వరంతో పాటు నొప్పులు, అలసట, ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతున్నాయి. వారం, పది రోజుల పాటు ఆరోగ్యం కుదుటపడడం లేదు. నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైరల్‌ ఫీవర్లతో బాధపడుతూ వైద్యం కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్లూ, శ్వాసకోశ వ్యాధులు, మలేరియా, టైపాయిడ్‌, చికున్‌గున్యా, డెంగీ లక్షణాలతో ఆప్పత్రుల్లో చేరుతున్నారు.

ఆస్పత్రుల్లో పెరిగిన ఓపీ

ప్రస్తుతం జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో ఓపీ పెరగడంతో పాటు ఇన్‌పేషెంట్‌గా కూడా చికిత్స పొందుతున్నారు. నల్లగొంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పది రోజుల క్రితం వరకు ఓపీ కోసం వచ్చే వారి సంఖ్య 400 ఉండగా ప్రస్తుతం 600 వరకు ఓపీ సేవలకు వస్తున్నారు. ఇన్‌పేషెంట్ల సంఖ్య రెండింతలు అయింది. ఏరియా ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరిగింది.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల మోత

గ్రామీణ ప్రాంతాల్లో జ్వర పీడితులు ఎక్కువగా స్థానిక ప్రైవేట్‌ వైద్యుల వద్దే చికిత్స పొందుతున్నారు. ఎలాంటి అనుమతులు లేని ల్యాబుల్లో డెంగీ, మలేరియా లాంటి పరీక్షలను చేస్తూ రోగుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులను గుంజుతున్నారు. స్కానింగ్‌, రక్త పరీక్షల పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. వైరల్‌ ఫీవర్‌ బాధితులను ఆసుపత్రిలో చేర్చుకుంటూ వైద్యం పేరుతో 3, 4 రోజులు ఉంచుకుని రూ.20 నుంచి రూ.30 వేల వరకు గుంజుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇంటింటా సర్వే చేస్తున్నాం..

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తమయ్యాం. ఇంటింటికి ఫీవర్‌ సర్వే చేస్తున్నాం. వ్యాధి లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నాం. ప్రజలు కూడా పరిసరాలు, ఇంటి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్స చేయించుకోవాలి.

– డాక్టర్‌ కె. రాహుల్‌, డీఎంహెచ్‌ఓ

ఫ వాతావరణ మార్పులతో మంచం పడుతున్న ప్రజలు

ఫ జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో ఇబ్బందులు

ఫ ఆస్పత్రుల్లో పెరుగుతున్న ఓపీ,

ఇన్‌ పేషంట్లు

ఫ టెస్టుల పేరుతో దోచుకుంటున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు

ఆరేళ్లలో నమోదైన కేసులు ఇలా..

సంవత్సరం డెంగీ మలేరియా చికున్‌గున్యా

2021 57 1 –

2022 136 5 –

2023 241 4 4

2024 357 2 8

2025 45 2 –

2026 18 2 –

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement