స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో నల్లగొండకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో నల్లగొండకు గుర్తింపు

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

జాతీయస్థాయిలో 10వ ర్యాంకు

స్వచ్ఛమైన గాలికి చిరునామాగా

నల్లగొండ నగరం నిలిచింది. ఇక్కడి పచ్చని చెట్లు.. చుట్టూ గుట్టలు, పంట పొలాలు నగర వాసులకు మంచి వాతావరణాన్ని పంచుతున్నాయి. స్వచ్ఛవాయు సర్వేక్షణ్‌–2026లో జాతీయ స్థాయిలో నీలగిరి గుర్తింపు పొందింది.

సాయి ద్వారకాపురి కాలనీలో రోడ్డుకు

ఇరువైపులా ఉన్న చెట్లు

దేశంలోనే 3 లక్షలలోపు జనాభా కలిగిన నగరాల్లో 10వ ర్యాంకు సాధించి నల్లగొండ కార్పొరేషన్‌ ఉత్తమ పనితీరును కనబరిచింది. దీంతోపాటు 10 వేలలోపు జనాభా కలిగిన వార్డుల్లో నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 16వ డివిజన్‌ ఉత్తమ అవార్డు సాధించింది. జాతీయ స్థాయిలో 2వ ర్యాంకుతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మొత్తంగా 3 లక్షలలోపు జనాభా కలిగిన పట్టణాల (మూడో) కేటగిరీలో నల్లగొండ కార్పొరేషన్‌ 200 గాను 185.8 స్కోర్‌ సాధించింది. మొత్తంగా ఐదు కేటగిరీల్లో ఉత్తమ పనితీరును కనబరచడంతో రూ.20 లక్షల ప్రోత్సాహకాన్ని అందుకుంది. నగరం పరిధిలో పరిశ్రమలు లేకపోవడం, చుట్టూ పచ్చని పొలాలు ఉండడంతో నగరంలో స్వచ్ఛమైన వాతావరణం ఉంటోంది.

పొలింగ్‌ కేంద్రాల పరిశీలన

కేతేపల్లి : కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు దేవసేన, కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మంగళవారం పరిశీలించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ఓటర్ల సంఖ్య, మ్యాపింగ్‌ కాని ఓటర్లు, జాబితాలో తేడాలున్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, విచారణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఆర్‌ఓ రమాదేవి, తహసీల్దార్‌ యు.రమాదేవి, డీటీ ఎండీ.సత్తార్‌, ఆర్‌ఐ రాంచంద్రయ్య, సర్పంచ్‌ కె.సైదిరెడ్డి, సూపర్‌వైజర్‌ సంధ్యారాణి ఉన్నారు.

3లక్షలలోపు జనాభా కలిగిన నగరాల కేటగిరిలో 10వ ర్యాంకు

వార్డుల కేటగిరీలో 16వ డివిజన్‌కు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు

రూ.20 లక్షల ప్రోత్సాహకం అందజేత ఇంటింటా మొక్కలతో పరుచుకున్న పచ్చదనం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ)లో అరుదైన ర్యాంకులతో మెరిసింది. ఒకవైపు పట్టణాల విభాగంలో, మరోవైపు వార్డుల విభాగంలో జాతీయ స్థాయి అవార్డులను కై వసం చేసుకుంది. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో అధికారుల ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం తోడవడంతో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ – 2026లో నల్లగొండకు అరుదైన గౌరవం దక్కింది.

చంద్రగిరి విలాస్‌లో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన చెట్లు

మాట్లాడుతున్న రవీంద్రకుమార్‌, చిత్రంలో బండా నరేంద్రర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, భగత్‌ తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement