పారదర్శకంగా ఓటరు జాబితా | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటరు జాబితా

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

నల్లగొండ : ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందించడమే ఎన్నికల సంఘం ఉద్దేశమని ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) జిల్లా పరిశీలకురాలు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ ఎ.దేవసేన అన్నారు. మంగళవారం ఆమె కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌), ఓటరు జాబితా రూపకల్పనపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరూ జాబితాలో ఉండాలని, అర్హత లేని వారు ఉండకూడదని, ఈ విషయంలో అధికారులతో పాటు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కలిసి పని చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ జిల్లాలో 1861 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి పోలింగ్‌ కేంద్రానికి బీఎల్‌ఓను నియమించామని.. 5889 మంది బీఎల్‌ఏలు ఉన్నారని, 15,16,253 మంది ఓటర్లకుగాను.. 13,16,860 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయిందని, 13,57,618 ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ను డిజిటలైజేషన్‌ చేశామని, మ్యాపింగ్‌ కానీ, ఓటరు జాబితాలో చిరునామా, వయస్సు తదితర విషయాల్లో తేడాలున్న 2,28,939 మందికి నోటీసులు జారీ చేశామని వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ కలెక్టర్‌ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్‌ థియాన్‌ మావి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఫ ‘సర్‌’ జిల్లా పరిశీలకురాలు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement