రాహుల్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

రాహుల్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

నల్లగొండ : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ కోట్వాలీ పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ నాయకులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కై లాష్‌ నేత డిమాండ్‌ చేశారు. మంగళవారం నల్లగొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన స్థలాన్ని శుద్ధి చేయడం దేశ సమానత్వానికి వ్యతిరేకమన్నారు. అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలపై కేసులు నమోదు చేయకుండా రాహుల్‌గాంధీపై కుట్రపూరితంగా కేసులు పెట్టడం బీజేపీ అరాచకానికి నిదర్శనమని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా శాసనసభకు, ప్రజల మధ్యకు రాకుండా ఫామ్‌హౌస్‌ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గోపగని మాధవి, అంబటి సోమయ్య, చింత ధనుంజయ్‌, ఎండీ.ముంతాజ్‌ అలీ, పోసిరెడ్డి సంతోష్‌రెడ్డి, మేకల రాజేందర్‌రెడ్డి, ఏళ్ల రవీందర్‌రెడ్డి, పగిళ్ల రాజు, స్వరూపరెడ్డి, సుజాత, చింతమల్ల వెంకయ్య, మధు ప్రసాద్‌, కాటం వెంకన్న, మిట్టపల్లి నాగరాజ్‌, వేముల గోపీనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement