ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
చందంపేట : విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను సమర్థంగా అమలు చేస్తూ పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. బుధవారం ఆయన చందంపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్, రికార్డుల నిర్వాహణ, కేసుల నమోదు, కేసుల దర్యాప్తు, పురోగతి, స్టేషన్ ఆస్తుల సంరక్షణ, సిబ్బంది హాజరు, ఆయుదాల నిర్వాహణ తదితర అంశాలను పరిశీలించారు. అలాగే డిజిటల్ రికార్డుల నిర్వాహణ, పోలీసు సిబ్బందికి అందజేసిన కిట్లను పరిశీలించారు. రౌడీషీటర్, అనుమానిత వ్యక్తుల కదలికపై నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్‌బీ సీఐ నాగరాజు, సడీఆర్‌బీ సీఐ శ్రీనునాయక్, డిండి సీఐ బీసన్న, చందంపేట ఎస్‌ఐ లోకేష్, నేరెడుగొమ్ము ఎస్‌ఐ నాగేంద్రబాబు, పోలీసు సిబ్బంది ఉన్నారు.


