నల్లగొండ : మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలో డీఆర్‌డీఏ–సెర్ప్ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధులతో నీలగిరి జిల్లా మహిళా కిసాన్ డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించి ఆయన మాట్లాడారు. మహిళలు డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకుని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. డ్రోన్ ఆపరేటర్ శిక్షణ పొందుతున్న 50 మంది మహిళలతో మాట్లాడారు. డ్రోన్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ నైపుణ్యం సాధించాలని కోరారు. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తామే డ్రోన్ యూనిట్ల యజమానులుగా మారాలన్నారు. శిక్షణ పొందుతున్న ఆపరేటర్ విజయలక్ష్మి మాట్లాడుతూ సొంతకాళ్లపై నిలబడానికి సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, మీరాయి సంస్థ స్థో విజయ్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సతీష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, ఏపీడీ శ్రవణ్‌కుమార్, శ్రీలేఖ, శ్రీనిధి ఆర్‌ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


