నల్లగొండ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్‌గాంధీని అక్రమంగా అరెస్టు చేసి గాయపరిచిన మోదీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్స్ ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కై లాష్‌నేత మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ అనేకమంది మరణానికి కారణమైన నీట్ ప్రశ్నపత్రాలు లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రం లీకేజీపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు ముంతాజ్ అలీ, సిరాజ్ ఖాన్, గోపిశెట్టి రాంబాబు, కుకుడాల బాలకృష్ణ, ఏళ్ల రవీందర్‌రెడ్డి, మేకల రాజేందర్‌రెడ్డి, జడల చిన్నమల్లయ్య, చింత ధనుంజయ్, మధు, ప్రసాద్, పోకల దేవదాస్, కట్టం వెంకన్న, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, సంతోష్‌రెడ్డి, మనోహర్, నలపరాజు సీనయ్య, కాటం వెంకన్నగౌడ్, సురేష్‌గౌడ్, వేముల గోపినాథ్, సైదులు, మాదగోని వెంకన్న, ఇందనూరి శ్రీను, ఎండీ.ఫిరోజ్, గడ్డం దామోదర్ పాల్గొన్నారు.


