పెరిగిన జ్వర బాధితులు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన జ్వర బాధితులు

Jul 13 2026 5:42 AM | Updated on Jul 13 2026 5:42 AM

పెరిగిన జ్వర బాధితులు

నకిరేకల్‌ : నకిరేకల్‌ పట్టణంతో పాటు పరిసర మండలాల ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలతో నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పది రోజుల క్రితం ఈ ఆస్పత్రిలో 250 నుంచి 300 మంది వరకు ఓపీ నమోదు కాగా ప్రస్తుతం 300 నుంచి 400 వరకు నమోదవుతోంది. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికి వైద్యులు అన్ని రకాలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని అడ్మిట్‌ చేసుకుని మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులతో ప్రస్తుతం 30 మంది ఇన్‌ పేషంట్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement