యాదగిరిగుట్ట : అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం, సమాన హక్కులు సాధించే దిశగా ఏఐవైఎఫ్ ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కేఎం గ్రాండ్స్‌లో ఆదివారం జరిగిన ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడవ మహాసభల ఆహ్వాన కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని సమస్యలపై యువత పోరాటాలు చేస్తున్నారని, ఇందులో ఏఐవైఎఫ్ ముందు వరుసలో ఉందన్నారు. బీజేపీ మత రాజకీయాలతో చేస్తున్న కుట్రలను ఏఐవైఎఫ్ తిప్పికొట్టాలన్నారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్ట కేంద్రంగా జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యుడు ఈటీ నర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు, మహిళల భద్రత, యువతకు ఉపాధి వంటి సమస్యలపై ఏఐవైఎఫ్ ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతను సంఘటితం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలను మరింత విస్తృతం చేయాలనేదే మహాసభల ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలీఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పేరబోయిన మహేందర్, వెంకటేశ్వర్లు, సత్యప్రసాద్, యుగంధర్, కొండల్, బాలకృష్ణ, సల్మాన్ బేగ్, ప్రవీణ్, యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, చెడే చంద్రయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ కొల్లూరి రాజయ్య, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆహ్వాన కమిటీ ఎన్నిక..
ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. చీఫ్ ప్యాట్రన్‌గా పల్లా వెంకట్‌రెడ్డి, ప్యాట్రన్స్‌గా ఉజ్జిని యాదగిరిరావు, బొలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, గోద శ్రీరాములు, గౌరవ అధ్యక్షులుగా నెల్లికంటి సత్యం, అధ్యక్షులుగా యానాల దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పేరబోయిన మహేందర్, కోశాధికారిగా కళ్లెం కృష్ణ, సహాయ కార్యదర్శులుగా ఎల్లంకి మహేష్, వెంకటేశ్వర్లు, కొండల్‌తో పాటు పలువురిని ఎన్నుకున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి
పల్లా వెంకట్‌రెడ్డి


