గట్టుప్పల్ : తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఆరు రోజులుగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. దీంతో పల్లెల్లో ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయం పరిష్కరించేందుకు ఆ శాఖ లైన్‌మెన్‌లు, అసిస్టెంట్ లైన్‌మెన్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉన్న విధులకు తోడు.. సబ్‌స్టేషన్ ఆపరేటర్, గ్రామాల్లో ఫ్యూజ్‌లు వేయడం, బ్రేక్‌డౌన్ సమస్యల పరి ష్కారం, విద్యుత్ బిల్లులు వసూలు వంటి పనులు వారే చేపట్టాల్సి వస్తోంది. దీంతో వినియోగదారులకు సరైన సేవలు అందడం లేదు.
జిల్లాలో 535 మంది ఆర్టిజన్ కార్మికులు
జిల్లా వ్యాప్తంగా 535 మంది ఆర్టిజన్ కార్మికులు 25 ఏళ్లుగా విద్యుత్ రంగంలో పని చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆనాడు కేసీఆర్ వీరిని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆనాటి నుంచి ప్రభుత్వమే వారికి వేతనాలు ఇస్తోంది. కానీ అప్పటి నుంచి వారికి ప్రమోషనన్స్ లేవు, ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింప చేయలేదు. దీంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది కార్మికులు రిటైర్డ్ అయ్యారు. వారికి ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదు.
ఏపీఎస్‌ఈబీ రూల్స్
వర్తింపజేయాలని డిమాండ్
తమకు ఏపీఎస్‌ఈబీ రూల్స్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలని, ప్రమోషన్స్ ఇవ్వాలని తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 535 మంది ఆర్టిజన్ కార్మికులు ఈనెల 8వ తేదీ నుంచి సమ్మెకు దిగారు. దీంతో విద్యుత్ సేవలకు అంతరాయం కలుగుతోంది.
ఫ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె చేస్తామంటున్న ఆర్టిజన్లు
ఫ అదనపు విధులు నిర్వహిస్తున్న
లైన్‌మన్‌లు, అసిస్టెంట్ లైన్‌మన్‌లు
ఫ విద్యుత్ సరఫరాలో
అంతరాయంతో..
వినియోగదారులకు ఇబ్బందులు


