పోస్టల్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

రామగిరి(నల్లగొండ) : పోస్టల్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సౌత్‌ ఇండియా సెక్రటరీ చలపతిగిరి అన్నారు. పోస్టల్‌ ఎంప్లాయీస్‌ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ పట్టణంలో అంబేద్కర్‌ జయంతి నిర్వచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్‌ సెక్రటరీ కొడంగల్‌ యాదయ్య, హైదరాబాద్‌ రీజియన్‌ సెక్రటరీ గోవర్ధన్‌, హెడ్‌ పోస్ట్‌మాస్టర్‌ స్వర్ణలత, శంకర్‌నాయక్‌, తోడేటి వీరస్వామి, ప్రసాద్‌, అరుణకుమారి, నగేష్‌, బెల్లం రామస్వామి, వెంకటయ్య, యాదయ్య, లక్ష్మీనరసింహ, కవిత, మారయ్య, అంకులయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement