ఫ వనవాసం వెళ్లిన కట్టంగూర్ వాసులు
కట్టంగూర్ : గ్రామానికి కీడుసోకిందని ప్రజలంతా వనభోజనానికి వెళ్లారు. ఈ సంఘటన కట్టంగూరు మండల కేంద్రంలో ఆదివారం చోటచేసుకుంది. ఏడాది కాలంగా కట్టంగూర్‌లో వృద్ధులతో పాటు యువకులు వరుసగా మరణిస్తుండటంతో గ్రామ పెద్దలు పురోహితుడిని సంప్రదించారు. గ్రామానికి కీడు సోకిందని గ్రామస్తులంతా ఒక రోజు ఊరు విడిచి వనవాసం వెళ్లాలని పురోహితుడు సూచించాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామస్తులంతా ఇళ్లకు తాళం వేసి సకుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్లారు. సంప్రదాయంగా వ్యవసాయ బావుల వద్ద వంటలు చేసుకొని అక్కడే భోజనం చేసి సాయంత్రం ఇళ్లకు తిరిగివచ్చారు.


