శాలిగౌరారం : రైతులను ఇబ్బంది పెడితే.. మిల్లులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ) వెంకటేశ్ హెచ్చరించారు. శాలిగౌరారం మండలంలోని వల్లాల సాయిబాలాజీ పార్‌బాయిల్డ్ రైస్‌మిల్లు వద్ద ధాన్యంలో తాలు ఉందంటూ మిల్లు యజమానులు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో ఆదివారం ‘సాక్షి’లో ‘ఆదిలోనే మిల్లర్ల అడ్డంకులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశానుసారం సాయిబాలాజీ రైస్‌మిల్లును డీఎస్‌ఓ వెంకటేశ్ ఆదివారం సిబ్బందితో కలిసి సందర్శించారు. రైస్‌మిల్లు వద్ద నిలిచిపోయిన లారీలను లోపలికి పంపించి ధాన్యం దిగుమతి చేయించారు. ఆయన వెంట డీటీ సీఎస్ జ్యోతి, నల్లగొండ ఆర్‌ఐ కుమార్‌రెడ్డి ఉన్నారు.


