సిండికేట్ ఆడించినట్లే..
మధ్యం వ్యాపారుల గుప్పిట్లో ఎకై ్సజ్, పోలీస్ శాఖలు
సమయ పాలన లేని వైన్ షాపుల కారణంగా మందుబాబులు బెల్ట్ షాపులనే బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి వైన్ షాపుల యజమానులే క్వార్టర్‌కు బ్రాండ్‌ను బట్టి ఎమ్మార్పీపై అదనంగా రూ.20 నుంచి రూ.25 వసూలు వసూలు చేస్తున్నారు. దీంతో బెల్ట్ షాపుల్లో ఒక్కో ఫుల్ బాటిల్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.160 నుంచి రూ.200 వరకు అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపుల వారు మందుబాబుల నుంచి ఒక్కో క్వార్టర్‌కు రూ.40 నుంచి రూ.50 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కొందరు ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది.. మద్యం వ్యాపారుల సిండికేట్ చేతుల్లో కీలు బొమ్మల్లా మారిపోయారు. మామూళ్ల దందాకు అలవాటు పడిన ఆ అధికారుల తీరుతో ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. వ్యాపారులు బెల్ట్ షాపులకు అదనపు ధరలకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోకుండా వారికే వంతపాడుతున్నట్లు తెలిసింది. అంతేకాదు సిండికేట్ దందాలో మద్యం కల్తీ జోరుగా సాగుతున్నా నోరు విప్పడం లేదని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సిండికేట్ నుంచి వచ్చే పెద్దమొత్తానికి అలవాటు పడి.. స్టాక్ మిస్ మ్యాచింగ్ పేరుతో నోటీసులు ఇస్తూ ఇతర వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘బెల్ట్’కు అండదండలు
జిల్లాలో బెల్ట్ షాపుల వ్యాపారం మూడుపూలు ఆరుకాయలు అన్నచందంగా సాగుతోంది. ఏ గ్రామంలోకి వెళ్లినా రెండు మూడింటికి తగ్గకుండా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. ఎకై ్సజ్, స్థానిక పోలీసుల నుంచి వైన్స్ యజమానులకు పూర్తిస్థాయిలో అండదండలు లభిస్తుండడంతో.. వైన్స్ యజమానులు బెల్ట్ షాపులు నిర్వహించే వారికి అదనపు రేట్లకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అలా వచ్చిన మొత్తం నుంచే ఎకై ్సజ్, పోలీసు అధికారులకు, సిబ్బందికి ముడుపులు ముట్టజెప్పుతారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఉన్నా మండలాల్లో రాత్రి 8 గంటల వరకు వైన్స్‌లను మూసేస్తారని.. బెల్ట్ షాపులకు బేరం పెంచడం కోసమే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి నెలా మట్టుజెప్పాల్సిందే..
నల్లగొండ జిల్లాలో 154, సూర్యాపేట జిల్లాలో 93, యాదాద్రి భువనగిరి జిల్లాలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాలను నుంచి స్థానిక ఎకై ్సజ్ అధికారులకు ప్రతి నెల కనీసం రూ.15 వేలు, వ్యాపారం అఽధికంగా సాగే ప్రాంతమైతే రూ.25 వేలు, స్థానిక పోలీసులకు కూడా నెలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఆ మొత్తాన్ని ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తారని, మద్యం షాపుల వద్ద చిన్నపాటి సమస్య వచ్చినా న్యూసెన్స్ కేసులు పెట్టి ఇబ్బందులపాలు చేస్తారని తెలుస్తోంది. ప్రతి నెలా ముడుపులు ఇస్తే మాత్రం మద్యం షాపులకు, బెల్ట్ షాపులకు మద్దతు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెల్ట్‌షాపులపై కేసులు పెట్టకుండా, వైన్స్, పర్మిట్ రూంల నిర్వహణ విషయంలోనూ ఇబ్బందులపాలు చేయకుండా ఉండేందుకు ముడుపులు చెల్లించక తప్పదని ఓ వైన్స్ యజమానే పేర్కొన్నారు.
ఫ ఎక్కువ రేట్లకు విక్రయాలు, మద్యం కల్తీపై నోరుమెదపని వైనం
ఫ బెల్టుషాపుల్లో విచ్చలవిడిగాసాగుతున్న మద్యం అమ్మకాలు
ఫ కేసుల పేరుతో చిన్న వ్యాపారులకు బెదిరింపులు
ఫ అధికారుల తీరుతో ప్రజల జేబుకు చిల్లు


