రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డికి నివాళి
చిట్యాల: చిట్యాల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి (ముప్ప నర్సింహా రెడ్డి) (84) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, జియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా విధులు నిర్వహించారు. 2004 నుంచి 2007 వరకు భూదాన్‌పోచంపల్లిలోని శ్రీ స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఆయనకు భార్య భారతి, కుమార్తె అర్పిత, అల్లుడు గోపాల్‌రెడ్డి(మద్యప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరి) ఉన్నారు. ఎంఎన్ రెడ్డి మనవడితో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కుమార్తెతో వివాహమైంది. ఎంఎన్.రెడ్డి మృతదేహాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాళులర్పించారు. చిట్యాల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎంఎన్.రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.
పలువురి సంతాపం
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి మృతి పట్ల ఆదివారం సంస్థ చైర్మన్ కిషోర్‌రెడ్డి, డైరెక్టర్ హరికృష్ణ, వైఎస్ చక్రవర్తిస్వామి, అధ్యాపకులు సంతాపం తెలిపారు.
హామీలు అమలు చేయడంలో
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
చిట్యాల: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బాకీ కార్డులను ఆదివారం చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బాకీ పడిన మొత్తాన్ని, రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వార్డు ప్రజలకు వివరించారు. అనంతరం చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ హయాంలోనే చిట్యాల మున్సిపాలిటీలో సుమారుగా రూ.30కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వైకుంఠధామం, ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాజ్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ దుకాణ సముదాయాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో చిట్యాల మున్సిపాలిటీలో ఒక్క అభివృద్ది కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీంధర్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు జమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి, జిట్ట బొందయ్య, కందాటి రమేష్‌రెడ్డి, రుద్రవరం యాదయ్య, కన్నెబోయిన శ్రీశైలం, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఆవుల ఆనంద్, అమరోజు నవీన్‌కుమార్, విఠల్‌రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు.
● మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డికి నివాళి
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డికి నివాళి


