భువనగిరి: చికిత్స పొందుతూ ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం వద్ద చోటుచేసుకుంది. మండలంలోని తుక్కాపురం గ్రామానికి చెందిన నరాల శంకర్ యాదవ్(32) ఏఆర్ కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 28న స్వగ్రామానికి వచ్చాడు. తుర్కపల్లిలో తన స్నేహితుడు ఉద్యోగం సాధించిన సందర్భంగా అతడిని కలిసేందుకు అదేరోజు బైక్‌పై వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో సాయంత్రం వడపర్తి గ్రామం వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. కాగా.. మృతుడి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు.
విద్యుత్ కేబుల్ వైర్ల చోరీ
నూతనకల్: మండల పరిధిలోని చిల్పకుంట్లలో విద్యుత్ మోటర్ల కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చోరీ చేశారు. పొలానికి ఉపయోగించే విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లు, ఫీజ్‌లను దొంగిలించారని సుమారు 20మంది రైతులకు చెందిన బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేబుల్ వైర్ల చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించాలని కోరారు.


