రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే క్రమంలో ఏకాగ్రత అవసరం. ఒక్కోసారి రెండు గంటల సమయం కూడా పడుతుంది. ఈక్రమంలో వారికి ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ ఆస్పత్రికి తీసుకువచ్చేలా చూస్తాం. కష్టాలను ఎదుర్కొంటున్నా.. ప్రజలకు అందించే సేవల్లో వాటిని మరిచిపోతాం. 19ఏళ్లలో 18,550 ఎమర్జెన్సీ కేసులు చేశాం. 108 అంబులెన్స్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైద్యం అందించడం అదృష్టంగా భావిస్తున్నాం.
– వెలిజాల సైదులు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్


