మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా ఉండాలని, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, మౌలిక వసతులు, సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు ముసాబ్ అహ్మద్, మల్లేశం, శ్రీనివాస్, రామదుర్గారెడ్డి, సుదర్శన్, దండు శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి


