30న ఎన్జీ కాలేజీలో గాంధీ విగ్రహాల ప్రదర్శన
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో ఈ నెల 30వ తేదీన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చీఫ్ అడ్వైజర్ ఎంవీ.గోనారెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నీరుడు దయాకర్‌రెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ కె.కరుణాకర్‌రెడ్డి, పాముల అశోక్, బొమ్మపాల గిరిబాబు, కె.నాగమణి, జ్యోతి, టి.చిరంజీవులు, మరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అరుణ, శ్రీనివాస్‌గౌడ్, ఎండీ.అజీజ్, రాధిక తదితరులు పాల్గొన్నారు.


