సాంకేతిక విజ్ఞానం పెంపొందాలి
నల్లగొండ టూటౌన్ : ఎన్నో కొత్త ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో భారతదేశం ముందంజలో ఉందని, విద్యార్థులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్‌స్పైర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఆయన ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో చక్రం, విద్యుత్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వంటివి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వల్లే ఆవిర్భవించాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోందని, దానికి అనుగుణంగా విద్యార్థులు మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు. ఒక అంశంపై పరిశీలన చేయడం ద్వారా అవగాహన ఏర్పడుతుందని, మన సమస్యలకు అక్కడే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. రెండు రోజుల పాటు చేపడుతున్న వైజ్ఞానిక ప్రదర్శనలో 284 ఎగ్జిబిట్స్ పెట్టడం గొప్ప విషయమన్నారు. ఇక్కడి నుంచి 10 నుంచి 15 ఎగ్జిబిట్స్ జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాక్షించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ తరగతి గదిలో విన్న అంశాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్‌ను పరిశీలించి వారితో మాట్లాడారు. అంతకు ముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ కమిషనర్ వాణి, డీఈఓ భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
ఫ పరిశీలన ద్వారా విషయాన్ని అవగాహన చేసుకోవాలి
ఫ జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌లో కలెక్టర్ చంద్రశేఖర్
సాంకేతిక విజ్ఞానం పెంపొందాలి
సాంకేతిక విజ్ఞానం పెంపొందాలి


