ఎకై ్సజ్‌.. గుడ్‌విల్‌ | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌.. గుడ్‌విల్‌

Jan 3 2026 7:49 AM | Updated on Jan 3 2026 7:49 AM

ఎకై ్సజ్‌.. గుడ్‌విల్‌

ఎకై ్సజ్‌.. గుడ్‌విల్‌

ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరింపు!

ఒక్కోషాపు నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎకై ్సజ్‌ అధికారుల వసూళ్ల దందా అడ్డగోలుగా సాతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో ప్రారంభమైన మద్యం దుకాణదారుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మొదట గుడ్‌ విల్‌ కింద వన్‌ టైమ్‌ అమౌంట్‌ వసూలు చేస్తున్న ఎకై ్సజ్‌ సిబ్బంది.. నెలవారీ మామూళ్లు వేరుగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా షాపులను దక్కించుకున్న వారి నుంచి ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దుకాణాల కోసం ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యాపారులు.. ఇప్పుడు ఈ వసూళ్ల దందాతో ఇబ్బంది పడుతున్నారు.

డిసెంబర్‌ 1న దుకాణాలు ప్రారంభం

2025 అక్టోబర్‌లో నిర్వహించిన టెండర్లలో షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి కొత్త షాపులను ప్రారంభించారు. ఆ షాపులనుంచి గుడ్‌ విల్‌ కింద ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికాల మౌఖిక ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పట్టణాల్లో ఎక్కువ మొత్తం

జిల్లాలో 154 మద్యం షాపులు ఉన్నాయి. అందులో సగానికిపైగా మద్యం దుకాణాలు పట్టాణాల్లో ఉన్నాయి. అలాంటి షాపుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల నుంచి కనీసం రూ.2 లక్షలకు తగ్గకుండా వసూలు చేస్తున్నట్లు షాపుల నిర్వాహకులే గగ్గోలు పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా వ్యాపారం కొనసాగే, దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా సేల్స్‌ ఉండే ప్రాంతాల్లోనూ గుడ్‌ విల్‌ కింద రూ.3 లక్షలకు తగ్గకుండా ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నట్లు సమాచారం.

మొదటిసారిగా షాపులు వచ్చిన వారిని టార్గెట్‌ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. రూ.50 లక్షలు పెట్టి షాపు దక్కించుకున్న మీరు రూ.3 లక్షలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఇస్తే అన్నీ మేమే చూసుకుంటాం అని చెబుతూ వసూళ్లకు దిగుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా ఎవ్వకపోతే కేసులు తప్పవని కూడా బెదిరిస్తున్నట్లు తెలిసింది. లొకేషన్‌ సరిగ్గా లేదని, ప్రార్థన మందిరాలకు పక్కనే ఉన్నాయని, నిబంధనలు పాటించడం లేదనే సాకులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇక, గతంలో వైన్స్‌ నడిపించి, ఈసారి కూడా లాటరీలో షాపులను దక్కించుకున్న వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారన్న తెలుస్తోంది. కొత్త షాపుల వారే ఇస్తుండగా, మీరు ఇవ్వకపోవడం ఏంటి? అన్నీ మీకు తెలుసుకదా.. ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారని ఓ వైన్స్‌ షాపు యజమాని పేర్కొన్నారు.

ఫ మొదట గుడ్‌విల్‌ కింద.. ఆ తర్వాత నెలవారీ మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి

ఫ టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేయిస్తున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు

ఫ ఇబ్బందులు పడుతున్న మద్యం వ్యాపారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement