ముఖ్యమంత్రిని కలిసిన కలెక్టర్
నల్లగొండ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ బి.చంద్రశేఖర్ గురువారం రాత్రి హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డిని కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇన్‌చార్జి అదనపు
కలెక్టర్‌గా అశోక్‌రెడ్డి
నల్లగొండ : స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌గా నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జిగా ఉన్న మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఉండగా.. ఆయన బదిలీ కావడం.. ఆ తరువాత బదిలీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
క్షయ రహిత జిల్లా కోసం కృషి చేయాలి
నల్లగొండ టౌన్ : నల్లగొండను క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చెస్ట్ ఎక్స్‌రే పరికరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎక్స్‌రే క్యాంపు నెల రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఏఆర్‌టీ మందులను వాడే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహ నేత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుల్‌కు
సేవా పతకం
నల్లగొండ : నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ పాయల రాజు తెలంగాణ సేవా పతకానికి ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో పోలీస్‌శాఖలో చేరిన ఆయన 25 ఏళ్లుగా క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో ఆదర్శ పోలీస్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా స్పెషల్ పార్టీలో 8 సంవత్సరాలు పనిచేసి కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. అనేక క్లిష్టమైన కేసుల డిటెక్షన్‌లో కీలక పాత్ర పోషించారు. జిల్లాలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసు చేధనలో పాల్గొన్నారు. 2022లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ఈయనకు ఈ నెల 26న ఎస్పీ చేతుల మీదుగా పతకం అందుకోనున్నారు. సేవా పతకానికి ఎంపికై న రాజును టూ టౌన్ ఎస్‌ఐ వై.సైదులు శుక్రవారం సన్మానించారు.
8న ఎంకేఆర్ కళాశాలలో సాధన ఫెస్ట్
దేవరకొండ : దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 8న సాధన ఫెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ–2026 నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమావత్ రవి తెలిపారు. కార్యక్రమ పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, నారాయణరెడ్డి, లకుమారపు మల్లయ్య, రాజేశ్, పీజే శ్యాంసన్, చంద్రమౌళి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన కలెక్టర్
ముఖ్యమంత్రిని కలిసిన కలెక్టర్
ముఖ్యమంత్రిని కలిసిన కలెక్టర్


