రేణుకా ఎల్లమ్మకు పుష్పాలంకరణ
కనగల్ : దర్వేశిపురం శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో గురువారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించిన అర్చకులు కుంకుమార్చన, అభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారి అంబటి నాగిరెడ్డి, ఆలయ సిబ్బంది చంద్రయ్య, అర్చకులు పాల్గొన్నారు.
ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయం
నల్లగొండ : నూతన సంవత్సరంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేయనుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా గురువారం నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో డీఎస్పీలతో కలిసి కేక్ కట్ చేసి మాట్లాడారు. గడిచిన ఏడాదిలో జిల్లా ప్రజల సహకారంతో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించగలిగామన్నారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణ వంటి అంశాల్లో ప్రజల సహకారం ప్రశంసనీయమన్నారు. నేరాల నివారణకు ముందస్తు చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు బందోబస్తు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీఐ శత వసంతాల సభను జయప్రదం చేయాలి
చండూరు : సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యరద్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. గురువారం చండూరులోని మాదగోని నర్సింహ భవన్‌లో జరిగిన మునుగోడు నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐకి వందేళ్ల పోరాట చరిత్ర ఉందని పేర్కొన్నారు. పార్టీ నూతన సభ్యత్వాలు చేర్పించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, అంజాచారి, తీర్పారి వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, బొల్గూరి నరసింహ, మండల కార్యదర్శులు నలపరాజు సతీష్, చాపల శ్రీను, సూదనబోయిన రమేష్, శేఖర్, లాలు, సురిగి చలపతి, పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, బరిగెల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
రేణుకా ఎల్లమ్మకు పుష్పాలంకరణ
రేణుకా ఎల్లమ్మకు పుష్పాలంకరణ


