క్యాలెండర్ రూపకల్పన అభినందనీయం
రామగిరి(నల్లగొండ) : కోర్టు పని దినాలు, సెలవులతోపాటు న్యాయవాదులకు అవసరమయ్యే విలువైన సమాచారంతో ఐలు నూతన సంవత్సరం ప్యాకెట్ క్యాలెండర్‌ను రూపొందించడం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలు) ఆధ్వర్యంలో రూపొందించిన ప్యాకెట్ క్యాలెండర్‌ను గురువారం నల్లగొండ కోర్టులో జిల్లా జడ్జి ఎం.నాగరాజు ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంతుల శంకరయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కార్యదర్శి మంద నగేష్, న్యాయమూర్తులు శిరీష, సాయిగీత, న్యాయవాదులు ఎస్‌ఆర్. ఠాగూర్, ఎం.నాగిరెడ్డి, కీసర శ్రీనివాసరెడ్డి, పి.బ్రహ్మచారి, పేరుమాళ్ల శేఖర్, జెనిగల రాములు పాల్గొన్నారు.


