కూలీలు కరువు | - | Sakshi
Sakshi News home page

కూలీలు కరువు

Dec 7 2025 7:27 AM | Updated on Dec 7 2025 7:27 AM

కూలీల

కూలీలు కరువు

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దేవరకొండతో ప్రత్యేక అనుబంధం ఉంది

న్యూస్‌రీల్‌

నల్లగొండ సీఈ పరిధిలో..

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు సంతోషగా ఉన్నారు

– దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. దీంతో యాసంగి సాగు పనులకు కూలీలు దొరకడం లేదు.
ముగ్గురి అరెస్ట్‌
వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని శనివారం మునగాల పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఫ అంబేడ్కర్‌కు నివాళి

కాంగ్రెస్‌తోనే బీసీలకు న్యాయం

కాంగ్రెస్‌ పార్టీతోనే బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

- 8లో

సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్‌ను కూలే దశకు తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎస్సెల్బీసీ లేకపోతే ఈ ప్రాంతం ఏడారే అవుతుందని, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేవరకొండలో ఉన్న గుట్టల మాదిరిగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయని, వాటిని దశల వారిగా పరిష్కరించేందుకు సీఎం సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దేవరకొండ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తన అమ్మమ్మ ఊరు దేవరకొండ మండలంలోని ముదిగొండ అని, అలాగే దేవరకొండ ఎమ్మెల్యే స్వగ్రామం ముదిగొండే అన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ అభ్యర్థిగా తాను పోటీ చేసిన సమయంలో దేవరకొండ ప్రాంత ప్రజలు తనకు అత్యధిక మెజార్టీ అందించారని, ఈ ప్రాంతం వాసులు తనపై చూపే అప్యాయతను ఎప్పటికీ మరువలేనన్నారు. జిల్లాలో 2.50లక్షల కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామని.. జిల్లా వ్యాప్తంగా 15.63 లక్షల మందికి సన్న బియ్యం అందుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ముందున్నామని, దేవరకొండ నియోజకవర్గంలో ధాన్యం అమ్మిన రైతులకు రూ.45 కోట్లు చెల్లించామన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అంభభవాని, కంబాలపల్లి, పొగిళ్ల, ఏకేబీఆర్‌, పెద్దగట్టు లిఫ్టు ఇరిగేషన్‌ పనులకు రూ.440 కోట్లు మంజూరు చేశామని, ఈ లిఫ్టు ఇరిగేషన్‌ పనులు పూర్తయితే 37వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పెండ్లిపాకల ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులను పూర్తి చేస్తామని, డిండి ఎత్తిపోతల, మిర్యాలగూడ నియోజకవర్గంలో నెల్లికల్‌ లిఫ్ట్‌తోపాటు మిగతా ప్రాజెక్టులన్నీ ఎన్నికల నాటికి పూర్తి చేస్తామన్నారు.

నేడు నల్లగొండకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

నల్లగొండ టూటౌన్‌ : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం నల్లగొండకు రానున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతెపాక లింగస్వామి, మండల వెంకన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించనున్న ఆ పార్టీ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొనున్నారని పేర్కొన్నారు. సమావేశానికి పార్టీ నాయకులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

టైలరింగ్‌, కంప్యూటర్‌ శిక్షణకు దరఖాస్తులు

నల్లగొండ : నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో టైలరింగ్‌, కంప్యూటర్‌ ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు వికాస కేంద్ర మేనేజర్‌ ఎ.అనిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, పూర్తి వివరాల కోసం 08682 244416, 9030244132 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

మెరుగైన బోధన అందించాలి

నిడమనూరు : కస్తూరిబా గాంధీ విద్యాలయంలో (కేజీబీవీ) బాలికలకు మెరుగైన విద్యనందించాలని జిల్లా మహిళా సంక్షేమాధికారి, మండల ప్రత్యేకాధికారి కేవీ కృష్ణవేణి సూచించారు. శనివారం నిడమనూరు కేజీబీవీని ఆమె పరిశీలించారు. మెనూను, విద్యార్థినుల సంక్షేమంపై ఉపాధ్యాయులతో చర్చించారు. భవనం మరమ్మతులు చేపట్టకపోవడంపై ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించారు. త్వరితగతిన పనులు చేయాలని ఆదేశించారు. అనంతరం నిడమనూరు మండలంలోని నామినేషన్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వి.హిమబింధు, కార్యదర్శి నరసింహాచారి, ప్రత్యేకాధికారి పద్మారాణి ఉన్నారు.

ఇందుగులలో ఆగిన ఎన్నికలు

మాడుగులపల్లి : హైకోర్టు ఆదేశాలతో మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామంలో పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి. గ్రామానికి చెందిన చింతమళ్ల కల్పన అలియాస్‌ ధరావత్‌ కల్పన నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గ్రామంలో ఎన్నికల ప్రక్రియను ఈ నెల 15వ తేదీ వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఎన్నికల అధికారులు గ్రామంలో పంచాయతీ ఎన్నికను నిలిపివేశారు. 15వ తేదీన హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో గ్రామంలో బరిలో ఉన్న సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

కృత్రిమ మేధస్సుతో విప్లవాత్మక మార్పులు

రామగిరి(నల్లగొండ) : కృత్రిమ మేధస్సు(ఏఐ)తో భవిష్యత్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయని చైన్నె ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రకాష్‌ సాయివాసన్‌ అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఫిజిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. కృత్రిమ మేధస్సు, మెషిన్‌ లెర్నింగ్‌ కేవలం పరిశోధనాంశాలుగానే కాకుండా, భవిష్యత్‌ తరాలకు కొత్త అవకాశాలుగా మారుతున్నాయన్నారు. ఎంజీయూ కంప్యూటర్‌ ప్రొఫెసర్లు రెడమళ్ల రేఖ, సుధారాణి, ఎం.జయంతి, డి.సంధ్యారాణి, కె.హరీష్‌ మాట్లాడుతూ ఏఐ సహాయంతో ప్రతి విద్యార్థి అభ్యాస వేగానికి, అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సముద్రాల ఉపేందర్‌, సదస్సు కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, కో కన్వీనర్‌ ఎస్పీ వెంకటరమణ, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ రవికుమార్‌, అంతటి శ్రీనివాస్‌, అధ్యాపకులు ముని స్వామి, నాగరాజు, వెంకటరెడ్డి, అనిల్‌కుమార్‌, కిరణ్‌, నగేష్‌, రమ, సంధ్యారాణి పాల్గొన్నారు.

దేవరకొండ, కొండమల్లేపల్లి : ‘నల్లగొండ జిల్లా అంటేనే చైతన్యం.. నిజాం పాలనకు చరమగీతం పాడింది ఈ జిల్లానే. గత పాలకులు జిల్లా ప్రజలపై కక్షగట్టి ఎస్‌ఎల్‌బీసీ పనులను పక్కన బెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం’ అని ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాలు’ సభలో ప్రసంగించారు. రెండేళ్ల క్రితం ఓటు అనే ఆయుధంతో గడీల పాలన బద్దలు కొట్టి ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు చేపట్టలేదని, ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రాగానే టన్నెల్‌ పనులకు నిధులు కేటాయించామన్నారు. రాబోయే రెండేళ్లలో దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పెండింగ్‌ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్‌ చొరవతో ఒక్క దేవరకొండ నియోజకవర్గానికే అత్యధికంగా 14వేల రేషన్‌కార్డులు మంజూరయ్యాయనితెలిపారు. దేవరకొండకు నర్సింగ్‌ కాలేజీ మంజూరు చేస్తామని, అందుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచిస్తామన్నారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులలు మంజూరు చేస్తామని, దేవరకొండలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.5కోట్లు కావాలని ఎమ్మెల్యే బాలునాయక్‌ అడగగా.. రూ.6 కోట్ల మంజూరు చేయిస్తానన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక దేవరకొండ ప్రాంతానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్కను పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మద్దిమడుగులో గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మహిళా సంఘాలకు రూ.11.33కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాల చెక్కులు పంపిణీ చేశారు.

ప్రజాపాలన విజయోత్సవ

సభ సక్సెస్‌

‘ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు’ సభకు జనం భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి రాక గంట ఆలస్యమైనా ప్రజలు, పార్టీ శ్రేణులు ఓపికగా ఎదురు చూశారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణతో సభను ప్రారంభించారు. సీఎం ప్రసంగిస్తున్నంత సేపు జనం ఈలలు, కేకలతో సందడి చేశారు. 14వ శతాబ్ధం నాటి దేవరకొండ ఖిలా కోటగోడపై ఉన్న పూర్ణకుంభం చిహ్నాన్ని జ్నాపికగా ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందించారు. ముస్లింలు ఆయన చేతికి దట్టీకటి సత్కరించారు. సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి దేవరకొండపై వరాలజల్లు కురిపించారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్‌ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్‌, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌, గుత్తా అమిత్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్‌, మాధవరెడ్డి, వేణుధర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, యూనూస్‌, ఏవిరెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, మాధవరెడ్డి, దూదిపాళ్ల రేఖ, దేవేందర్‌, ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు..

దేవరకొండ పట్టణంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, 10మంది డీఎస్పీలు, 36 మంది సీఐలు, 115మంది ఎస్‌ఐలతో కలిపి 1,250మంది సిబ్బంది విధులు నిర్వహించారు.

620 నామినేషన్లు తిరస్కరణ

ఆన్‌, ఆఫ్‌ పద్ధతిలో సాగునీరు

దేవరకొండ : దేవరకొండ డివిజన్‌లో మూడవ విడుతలో జరుగనున్న గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. దేవరకొండ డివిజన్‌ పరిధిలోని 9మండలాలకు గాను 269 గ్రామంపంచాయతీలకు 1,962 సర్పంచ్‌ నామినేషన్లు రాగా.. వాటిలో 376 నిబంధనల ప్రకారం లేని నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 1586 నామినేషన్లు ఆమోదించారు. 2,206 వార్డు స్థానాలకు 5,606 నామినేషన్లు దాఖలుకాగా.. నామినేషన్ల పరిశీలన అనంతరం 244 తిరస్కరణకు గురయ్యాయి. 5362 నామినేషన్లు ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం అప్పీళ్లను స్వీకరించి సోమవారం వాటిని పరిష్కరించనున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ నెల 17న పోలింగ్‌ జరగనుంది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాసంగి సీజన్‌లో ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో సాగునీటి విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌ జలసౌధలో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో యాసంగి పంటల కోసం 80.74 టీఎంసీల నీటిని ప్రాజెక్టుల నుంచి విడుదల చేయాలని నిర్ణయించారు. అందులో నల్లగొండ చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) పరిధిలో 43.74 టీఎంసీల నీటి అవసరం ఉంటుందని అంచనా వేయగా, సూర్యాపేట చీఫ్‌ ఇంజనీర్‌ పరిధిలో 40 టీఎంసీల నీటి అవసరం ఉంటుందని తేల్చారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల కింద ఉన్న ఆయకట్టుకు 15 రోజులకు ఒకసారి ఆన్‌ ఆండ్‌ ఆఫ్‌ విధానంలో నీటిని విడుదల చేయాలని సీఈలను రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఆదేశించారు. తాగునీటి అవసరాలకు రిజర్వాయర్లలో నీటి నిల్వలను పదిలపరచాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

సూర్యాపేట సీఈ పరిధిలో..

ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్‌–2 కింద 2,14,080 ఎకరాలకు 14 టీఎంసీలు, మూసీ కింద 30 వేల ఎకరాలకు 4 టీఎంసీలు, ఎత్తిపోతల పథకాలు కలుపుకొని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద 2,29,961 ఎకరాలకు 22 టీఎంసీలు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తంగా సూర్యాపేట సీఈ పరిధిలో 4,74,041 ఎకరాలకు 40 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తేల్చారు.

సాయి ఈశ్వరాచారిది ప్రభుత్వాల హత్యే

కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో 1,45,248 ఎకరాలకు 19.10 టీఎంసీల అవసరం ఉంటుందని, ఆ మేరకు విడుదల చేయాలని తేల్చారు. ఏఎంఆర్‌పీ ఎస్‌ఎల్‌బీసీ పరిధిలో 2,67,650 ఎకరాలకు 20 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఆసిఫ్‌నహర్‌ (డైవర్షన్‌ స్కీం) కింద 15,245 ఎకరాలకు 2.18 టీఎంసీలు, డిండి కింద 12.975 ఎకరాలకు 2.46 టీఎంసీల నీటిని ఇవ్వాలని తేల్చారు. మొత్తంగా 4,41,118 ఎకరాలకు 43.74 టీఎంసీల నీటిని ఇచ్చేలా ప్రణాళిక ఖరారు చేశారు.

నల్లగొండ అంటే.. చైతన్యానికి ప్రతీక

ఫ ఈ ప్రాంత అభివృద్ధికి

మంత్రులను పంపి సమీక్షిస్తాం

ఫ పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలి

ఫ దేవరకొండలో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం

ఫ ‘ప్రజాపాలన విజయోత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఫ సభకు భారీగా తరలివచ్చిన జనం

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. దేవరకొండ ప్రాంతంలో అత్యధికంగా గిరిజనులు ఉండడంతో, ఆడ బిడ్డల అమ్మకం, తాగు, సాగునీటి వనరులు లేక కరువు కాటకాలతో అలమటించామని.. కానీ, కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓ పెద్ద మనిషి ఎస్‌ఎల్‌బీసీని కుర్చి వేసుకొని కూర్చొని పూర్తి చేస్తానని చెప్పి.. అది కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గ ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, నాయకులను గుండెల్లో దాచుకుంటారని చెప్పారు. ప్రభుత్వ చొరవతో త్వరలోనే కొండమల్లేపల్లిలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు కానుందని, దీంతో వాహనదారుల సమస్యలు తీరుతాయన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ముఖ్యమంత్రి విన్నవించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిని వంద పడకల నుంచి 200 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలని, పెండ్లిపాకల రిజర్వాయర్‌ ఎత్తు పెంచాలని, కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలని, గిరిజన మహిళలకు ఐటీడీఏ ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని, దేవరకొండలోని ఆర్డీఓ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి, నూతన మండలాలుగా ఏర్పడిన మండల కేంద్రాల్లో కార్యాలయల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని, డిండి మండలంలో నూతన వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి తాగునీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలా.. దేవరకొండ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఫ సర్పంచ్‌ 376, వార్డు సభ్యులవి 244

ఫ దేవరకొండ డివిజన్‌లో ముగిసిన నామినేషన్ల పరిశీలన

ఫ 15 రోజులకు ఒకసారి ఇచ్చేలా ప్రణాళిక

ఫ రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ నిర్ణయం

ఆమోదించిన నామినేషన్లు ఇలా..

మండలం సర్పంచ్‌ వార్డులు

దేవరకొండ 214 760

చింతపల్లి 150 777

చందంపేట 183 600

నేరెడుగొమ్ము 178 434

పీఏపల్లి 189 506

డిండి 230 825

గుర్రంపోడు 195 716

కొండమల్లేపల్లి 144 475

గుడిపల్లి 103 269

కూలీలు కరువు 
1
1/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
2
2/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
3
3/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
4
4/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
5
5/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
6
6/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
7
7/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
8
8/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
9
9/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
10
10/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
11
11/12

కూలీలు కరువు

కూలీలు కరువు 
12
12/12

కూలీలు కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement