మహిళలందరికీ చీరలు ఇస్తాం
నల్లగొండ : మహిళల ఆత్మగౌరవానికి తగ్గట్టుగా అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్‌లో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చీరలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గమంతా చీరల డిజైన్‌కు ఏడాది పాటు ఆలోచించి నాణ్యమైన చీరలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి చీరలు అవసరముంటే ఇప్పటికే 65 లక్షల చీరలు వచ్చాయన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు పంపిణీ చేస్తున్నారని, మిగతా చీరలు రాగానే పట్టణ మహిళలకు పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా డీఆర్‌డీఏ ద్వారా మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తునానమన్నారు. నల్లగొండ జీజీహెచ్, మెడికల్ కళాశాలను ఎంతో అభివృద్ధి చేశామని, ప్రతినెలా 800 ప్రసవాలతో పాటు అత్యాధునిక శస్త్ర చికిత్సలు కూడా చేస్తున్నామని తెలిపారు. మహిళల నైపుణ్యాభివృద్ధికి న్యాక్ ద్వారా భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. నల్లగొండ నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలంతా స్వయం సహాయక సంఘాల ద్వారా అందించే రుణాలతో ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం.. బస్‌లు, పెట్రోలు బంక్‌లు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించిందన్నారు. భవిష్యత్‌లో రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యత కూడా అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలోని మహిళలకు 4.24 లక్షల చీరలు అందించబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హఫీజ్‌ఖాన్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ పాల్గొన్నారు.
ఫ ఏడాది పాటు ఆలోచించి చీరలు డిజైన్ రూపొందించాం
ఫ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మహిళలందరికీ చీరలు ఇస్తాం


