పాఠశాలకు రాకుంటే నేనే మీ ఇంటికి వస్తా..
మోటకొండూర్: ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారిని తన బైక్‌పై పాఠశాలకు తీసుకువచ్చిన ఆసక్తికర ఘటన మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ముత్తిరెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గఫార్.. కాటేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు రావడం లేదని గమనించి శుక్రవారం వారి ఇళ్లకు వెళ్లాడు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో వారి తల్లిదండ్రులకు, విద్యార్థులకు వివరించాడు. అనంతరం విద్యార్థులను తన బైక్‌పై ప్రార్థనా సమయానికి ముందే పాఠశాలకు తీసుకువచ్చాడు.
విద్యార్థులను బైక్‌పై తీసుకువస్తున్న
ప్రధానోపాధ్యాయుడు గఫార్


