
భువనగిరి జిల్లాను ముంచెత్తిన వరద
సాక్షి,యాదాద్రి : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భువనగిరిలోని జంఖానగూడెం, ఆలేరు, మోత్కూరు, చౌటుప్పల్‌లోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజానీకం ఇబ్బందులకు గురైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాన్ ఆయకట్టులో చెరువులు అలుగుపోస్తున్నాయి. ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి
భువనగిరి నియోజకవర్గంలో..
భువనగిరి–చిట్యాల(ఎన్‌హెచ్– 161 ఏఏ) మధ్య నాగిరెడ్డిపల్లి వద్ద లోలెవల్ వంతెన పైనుంచి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో పోలీసులు బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం రాకపోకలు నిలిపివేశారు. గురువారం సాయంత్రం నుంచి అనుమతించారు.
● భువనగిరి మండలం అనాజిపురం–బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామాల మధ్య చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచిపోయాయి.
● మూసీ బ్రిడ్జిలు సంగెం, రుద్రవెల్లి వద్ద రాకపోకలను బుధవారం నిలిపివేసి గురువారం పునరుద్ధరించారు.
ఆలేరు నియోజకవర్గ పరిధిలో..
● ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో గండి చెరువు అలుగుపోస్తోంది. అధికారులు చెరువు గేట్లు ఎత్తి యాదగిరిపల్లి ఎస్సీ కాలనీ పక్క నుంచి వంగపల్లి వాగులోకి నీటిని పంపుతున్నారు.
● వర్షం కారణంగా యాదగిరి క్షేత్రానికి భక్తుల రాక తగ్గింది. ఆలేరు పట్టణంలో పెద్ద వాగు నిండుగా ప్రవహిస్తుంది.
ఫ పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ఫ భువనగిరి–చిట్యాల మార్గంలో నిలిచిన రాకపోకలు