
యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం
నకిరేకల్: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నకిరేకల్‌లోని తాటికల్ పీఏసీఎస్ వద్ద గురువారం ఉదయం యూరియా కోసం బారులుదీరిన రైతుల వద్దకు ఆయన చేరుకుని.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ.. రైతులు చంటిపిల్లలతో వచ్చి యూరియా కోసం క్యూ కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ కాళ్లు మొక్కి అయినా రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. లేందటే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, పీఎసీఎస్ మాజీ చైర్మన్ పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు పెండెం సదానందం, గొర్ల వీరయ్య, సామ శ్రీనివాస్‌రెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, పల్లె విజయ్, దైద పరమేశం తదితరులు ఉన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య